స్మశానం కోసం ఆందోళన – పోలీస్ లాఠీచార్జి వైస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం లోని శ్రీనగర్,పార్వతి నగర్,మహబూబ్ నగర్ గ్రామాల ప్రజలు స్మశానం కోసం ధర్నా చేశారు.శ్రీనగర్ కు చెందిన రమణ అనే వ్యక్తి మృతి చెందాడు. అతనికి అంతిమ సంస్కారం ఎక్కడ చేయాలో తెలియక వారు జాతీయ రహదారిపై ఆందోళన చేశారు.దీనిపై ఆగ్రహం చెందిన మైదుకూరు సీఐ,ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ ఝులిపించారు.ఇష్టానుసారంగా కొట్టారు.బూతులు తిట్టారు.అంతిమ సంస్కారానికి వచ్చిన వారిపై కేసులు కూడా పెట్టారు.