https://youtu.be/7jbE_dZEhSo
చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి.సొంత బేనర్‌పై చిరంజీవి కొడుకు రాం చరణ్ నిర్మిస్తుండగా సురేంద్ర రెడ్డి డైరెక్టు చేస్తున్నారు.కథను పరుచూరి బ్రదర్స్ అందిస్త్తే డైలాగ్స్‌ను బుర్రా సాయి మాధవ్ రాశారు.సినిమాను గాంధీ జయంతి అక్టోబర్ రెండున రిలీజ్ చేయడానికి సన్నాహాు చేస్తున్నారు.సినిమా రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 22న ఎల్బీ స్టేడియంలో ఎంతో వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంతో మంది డైరక్టర్లు,నటు హాజరయ్యారు.స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహా రెడ్డి కథను తీసి నా కను నెరవేర్చుకున్నానని చిరంజీవి చెప్పారు.సైరా వంటి సినిమా చేయడం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమని,ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా అని అన్నారు చిరంజీవి.స్వాతంత్య్ర సమరయోధిడి కథను అన్వేషిస్తుండగా పరుచూరి గోపాక్రిష్ణ ఉయ్యావాడ నరసింహా రెడ్డి కథను చెప్పాడని,ఈ కథ నచ్చడంతో కొణిదె ప్రొడక్షన్ బేనర్లో తెరకెక్కించడం జరిగిందని చెప్పారు.అంతా బాగానే ఉంది.కాని స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహా రెడ్డి అంటే ఎవరికీ ఎటువంటి ఆపేక్ష ఉండదు.మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు,ఫస్ట్ సివిల్ రెబిలియన్ అంటేనే అభ్యంతరం వ్యక్తం అవుతుంది.ఎందుకంటే ఉయ్యావాడ నరసింహా రెడ్డి బ్రిటీష్ వారిపై తిరగబడిరది 1845 సంవత్సరంలో.ఆయన ఎందుకోసం తిరగబడ్డాడనేది పక్కనపెడితే..ఆయన తిరుగుబాటు కంటే ముందు కర్నూు జిల్లాలోనే రెండు అతిపెద్ద తిరుగుబాట్లు జరిగాయి.1801లో దేవనకొండ మండం తెర్నేకల్ గ్రామంలో ముత్తుకూరు గౌడప్ప నాయకత్వంలో రైతు తిరుగుబాటు చేశారు.కరువు సమయలో బ్రిటీష్ పాకు శిస్తు పెంచి వసూు చేయడం వారికి నచ్చలేదు.కరువు సమయంలో తినడానికి తిండిలేని సమయంలో శిస్తు కట్టమని అడిగితే ఎలా అని ప్రశ్నిస్తూ శిస్తు కట్టేదిలేదని తిరుగుబాటు చేశారు.రైతు తిరుగుబాటు చేయడాన్ని సహించలేని బ్రిటీష్ సర్కారు ఊరుపై సైన్యాన్ని పంపి తుపాకు ఎక్కుపెట్టిస్తుంది.తెర్నేకల్ గ్రామ ప్రజు సాంప్రదాయక వస్తువుతో వారి తుపాకుకు,ఫిరంగును దాదాపు పదిహేను రోజు అడ్డుకొని యుద్దం చేశారు.తుపాకి తూటాు,ఫిరంగు గుండ్లకు సాంప్రదాయక పనిముట్లు ఎలా తట్టుకుంటాయి.ఇక ఫిరంగి గుండ్లతో కోట గోడను పగగొట్టి ఊరిలోకి జొరబడి దొరికినవారిని దొరికినట్లుగా చంపేసి ఊరిలోని బావిలో పారవేశారు.ఈ పోరాటంలో వంద మంది రైతు,మహిళు చనిపోయారు.ఈ రైతు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ముత్తుకూరు గౌడప్పను,రెడ్డి,కరణాను ఊరు వాకిలి ముందు ఉరితీశారు.ఈ పోరాటానికి గుర్తు ఊరిలో సజీవంగానే ఉన్నాయి.ప్రతియేటా ప్రభుత్వం కూడా ఆగష్టు 15న ఆయన పోరాటాన్ని స్మరించుకుంటుంది.తెర్నేకల్ పోరాటం గురించి ప్రజకు చెపుతోంది.దినపత్రికు సైతం తెర్నేకల్ తిరుగుబాటు అంటూ ఆగష్టున 15న తెర్నేకల్ పోరాటం గురించి రాస్తుంటాయి.మరి 1801లో జరిగిన ఈ పోరాటం పోరాటం కాదా..ఇది చరిత్ర కాదా..పరుచూరి బ్రదర్స్‌కు రాయసీమలోని పుస్తకాు చదివినపుడు,కర్నూు జిల్లాలో పాలెగాళ్ల వ్యవస్థ గురించి తొసుకున్నపుడు,ఆ పాలెగాళ్ల వ్యవస్థ ఎపుడు రద్దు అయ్యింది..ఎవరు రద్దు చేశారు..రద్దు తర్వాత పాలెగాళ్లుగా ఉన్నవారు ఏమి చేశారు..తదితర అంశా గురించి తొసుకోలేదా..?రచయిత తొసుకొని ఉంటే బాగుండేది.డైలాగు రాసిన బుర్రా సాయి మాధవ్ కూడా కర్నూులో స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర తొసుకొని డైలాగు రాసింటే బాగుండేది. 1801 తెర్నేకల్ తిరుగుబాటు మాత్రమే కాదు.1836లో కర్నూు చిట్ట చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ బ్రిటీష్‌వారిపై సాయుధ పోరాటం చేశారు.బ్రిటీష్ వారిని ఎదిరించిన నవాబు ఎవరంటే అది గులాం రసూల్ ఖాన్.ఈయన వహాబి యుద్దం స్పూర్థితో వారిపై సాయుధ పోరాటం చేశాడు.బ్రిటీష్ వారు ఈయనను బందిఖానా చేసి కుట్ర చేసి చంపారు.ఇది చరిత్ర కాదా..గులాం రసూల్ ఖాన్ చేసిన ఈ పోరాటం తిరుగుబాటు కాదా..రచయితు,డైరక్టర్,సినిమా నిర్మాత,నరసింహా రెడ్డిగా నటిస్తున్న చిరంజీవి సమాధానం చెప్పాలి. ఉయ్యావాడ నరసింహా రెడ్డి తిరుగుబాటు కంటే ముందు 1801 తెర్నేకల్ తిరుగుబాటు,గులాం రసూల్ ఖాన్ పోరాటం రెండు పెద్ద జరిగాయి.ఆ తిరుగుబాట్లలో,పోరాటంలో వందలాది మంది చనిపోయారు.నాయకత్వం వహించిన వారు వీరమరణం పొందారు.ఈ పోరాటాు వారి స్వార్థం కోసం చేసినవి కావు.రైతు కోసం,దేశ స్వాతంత్య్రం కోసం చేసినవి.మరి ఈ పోరాటాను విస్మరిస్తే ఎలా..రచయితకు ఇవి కనపడలేదా..రాయసీమలో..సీమ సింహద్వారం కర్నూులో అడుగుపెట్టానపుడు ఇవి వీరి చెవిన ఎవరూ వేయలేదా..వేసినా ఏమిలే అనుకొని ఇలా రెండు పోరాటాను విస్మరించి కథను రాశారా.. ఇపుడు కర్నూు జిల్లా ప్రజు కాని ముత్తుకూరు గౌడప్ప సంఘం వారు కాని కోరుకునేదేమిటంటే ఉయ్యావాడ నరసింహా రెడ్డి సినిమా తీయడంలో ఎటువంటి ఆపేక్షలేదు.కాని మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడంటేనే అభ్యంతరం ఉంటుంది.సినిమాలో ఆ ఫస్ట్ సివిల్ రెబిలియన్ అనే పదాన్ని తీసేయండి.లేకుంటే పోరాటం చేసిన వారిని అవమానించిన వారు అవుతారు మీరు.చరిత్ర మిమ్మల్ని క్షమించదు