కర్నూల్ జిల్లాలో యువకుడు దారుణ హత్య కర్నూల్ జిల్లా బేతంచర్లలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.రైల్వే క్వార్ట్రర్స్ దగ్గర ఈ హత్య జరిగింది.హత్యకు గురైన వ్యక్తి మధు ఆంజనేయులు గా పోలీసులు గుర్తించారు.ఒక చిన్న తగాదా హత్యకు దారితీసినట్లు స్థానికులు చెపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలులో కేన్సర్ ఆసుపత్రి పై పార్లమెంట్ లో ఎంపి బుట్టా రేణుక కర్నూలు లో ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన క్రింద మంజూరైన కాన్సర్ ఆసుపత్రి వేరే ప్రాంతమునకు తరలిస్తున్నారని వస్తున్న వార్తల పై కర్నూలు ఎంపి బుట్టా రేణుక పార్లమెంట్ లో మాట్లాడారు.కర్నూలులో క్యాన్సర్ ఆసుపత్రి ఉంటే రాయలసీమ,సీమకు ఆనుకొని ఉన్న తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రము లోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని,కర్నూలులో కాన్సర్ ఆసుపత్రి ఆవశ్యకతను ఆమె తెలియజేశారు.త్వరలోనే కర్నూలు లో కాన్సర్ ఆసుపత్రిని
Read More
కర్నూల్ జిల్లా ఆదోని లో దొంగలు హల్చల్ కర్నూల్ జిల్లా ఆదోని లో దొంగలు హల్చల్ చేసారు. రెండు షాపుల పై పడ్డారు.. ఆ షాపులు ఏవంటే బీరు షాపులు.. విచ్చలవిడిగా తాగారు..పగలగొట్టారు.. అందినకాడికి దోచుకెళ్లారు..