6 years ago janammata 0

కర్నూలు జిల్లాలో ప్రజలు జన్మభూమిని అడ్డుకున్నారు.people blocked the janmabhoomi at kurnool district

కర్నూల్ మండలం పూడూర్ గ్రామానికి చెందిన వారు జన్మభూమిని బహిష్కరించారు. కర్నూల్  నగరానికి అతి సమీపంలో వున్నా కనీస సౌకర్యాలు తీర్చలేదని ప్రజలు జన్మభూమి అడ్డుకున్నారు. కేవలం 15కి.మీ. దూరంలో ఉన్న తమ గ్రామానికి గత నాలుగేళ్లుగా  రోడ్లు వేయకపోవడంతో 108 సర్వీసులు కూడా  గ్రామానికి రావడంలేదని, ఇద్దరు గర్భిణీలు మార్గమధ్యంలో ఆటోలోనే ప్రసవించారని,వారిలో పురిటి బిడ్డ మృతి చెందడంతో ప్రజలు  ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్.అండ్ బి, రెవిన్యూ అధికారులను గ్రామంలోకి రాకుండా గ్రామం  వెలుపలే  అడ్డుకొని జన్మభూమి బ్యానర్లను, అర్జీ కాపీలను కాల్చి వేసి ప్రభుత్వం పై తమ నిరసనను తెలియచేసారు.