3 years ago janammata 0

 

కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆడపిల్లని పురిట్లోనే చెత్తకుప్పల్లోకి విసిరివేసారు.

పందులకు కుక్కలకు ఆహారంగా వేశారు  సునీత విలియమ్స్..ఒక కల్పనా చావ్లా.. వీరు ఆడపిల్లలు కాదా.. ఆడపిల్లలే.. వీళ్ళను చూస్తే వీళ్ళు మా కడుపునా ఎందుకు పుట్టలేదు అనుకోని తల్లి తండ్రులు ఎవరైనా వుంటారా..వీరి ధైర్య సాహసాలు అలాంటివి.. మరి అదే ఆడపిల్ల మన కడుపునా పుడితే ఎందుకు ఇలా చెత్తకుప్పలు పాల్జేస్తున్నారు..పందులకు ఆహారంగా ఎందుకు వేస్తున్నారు..చెత్తకుప్పలు పాలైన ప్రతి ఆడపిల్ల మరో కల్పనా చావ్లా అవుతుందని ఎందుకు అనుకోరు.. మరో సునీత విల్లియమ్స్ అవుతుందని ఎందుకు అనుకోరు.. ఆడపిల్ల ఆడ పిల్లేనని ఎందుకు అనుకుంటున్నారు.. ఆడపిల్ల పుడితే ఖర్చని.. మైనస్ అని ఎందుకు అనుకుంటున్నారు. అదే ఆడపిల్ల లేకుంటే ఆడపిల్లని పారేసే అమ్మ ఉండదు.. ఆడపిల్ల పుడితే మైనస్ అనే తండ్రి ఉండడు. ఇది పోనంతకాలం ఆడపిల్ల ఆడపిల్లగానే ఉంటుంది.. పందులకు.. కుక్కలకు ఆహరం అవుతూనే ఉంటుంది.