5 years ago janammata 0

చిరు వ్యాపారిపై ఖాకి ప్రతాపం 

చిరు వ్యాపారిపై ఖాకి తన ప్రతాపం చూపించాడు. ఖాకి కర్కశత్వానికి ఆ చిరు వ్యాపారి మృత్యువుతో పోరాడుతున్నాడు. చిన్న వ్యాపారి పైనే కాదు..ఆయన కుటుంబ సభ్యులపైనా  తన జూలుం చూపించాడు.పోలీస్ చేసిన అవమానం భరించలేక అతను యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి పూర్తిగి విషమించిందని,24 గంటల వరకు ఎమి చెప్పలేమని అంటున్నారు డాక్టర్లు.పౌరులపై జరిగిన ఈ ఖాకి ప్రతాపం ఎక్కడంటారా.. కర్నూల్ జిల్లా డోన్ లో.. ఇంతకు ఎమి జరిగిందంటే ..కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో వరదరాజు దంపతులు వేరుశనగ వ్యపారం చేసుకుంటు జివనం సాగిస్తూన్నారు. ఎదురుగా వున్న మరో వ్యపారి తో చిన్న తగాదా  వచ్చింది. తరుచూ వివాదం జరుగుతోంది ఇద్దరి మధ్య.. వివాదం కాస్తా పెద్దది అయ్యి ఇద్దరి మద్య గర్షణ జరిగి వరదరజుల పై  భౌతికంగా దడి చేశారు.గాయాలతో పోలీసు స్టేషన్ ను ఆశ్రయించాడు వరదరాజులు.. ఫిర్యదు చేయాడానికి వెలితే ఫిర్యాదు తీసుకోని ఎస్ ఐ  శ్రీనివాసులు, వరదరాజులును,భార్య సుజాత ను తీవ్రంగా కొట్టాడు. మహిళ అని కూడా చూడకుండా ఎస్సై జుట్టుపట్టుకొని కొట్టాడని సూజాత ఆరోపిచారు.. దినితో తన భర్త వరదరాజులు తెల్లవారుజామున మనస్తాపంతో యాసిడ్ తాగి ఆత్మహత్యయత్న చెసుకున్నాడని,పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభూత్వ ఆసుపత్రికి తరలించామని,ఆసుపత్రి లో  చికిత్స పోందుతున్నాడని .. కడుపులో పేగులు కాలిపోయాయని డాక్టర్లు చెపుతున్నారని.. 24 గంటలు గడిచిన తరువాత కానీ చెప్పలేమని.. ఆ తరువాత  తదుపరి చికిత్స చేస్తామని డాక్టర్లు అంటున్నారని సుజాత చెపుతోంది ..చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే.. చట్ట విరుద్దంగా ప్రవర్తిస్తే తాము ఎవ్వరికి చెప్పుకొవాలని.. తన భర్తకు ఎమైన జరిగితే తమ కుటుంబం రోడ్డున పడుతుందని.. తన భర్త  ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ  ఆసుపత్రిలో చేరడానికి డోన్ ఎస్సై శ్రీనివాసులే కారణమని,ఎస్సై పై తగిన చర్యతీసుకోవాలని,తమకు న్యాయం చెయాలని వారు కోరుతున్నారు.