6 years ago janammata 0
ఎస్ఐ భార్య ఆత్మహత్య.
అనంతపురం జిల్లా గుడిబండ ఎస్.ఐ. ఖాజాహుస్సేన్ భార్య అంజూమ్ బేగం ఆత్మహత్య చేసుకుంది.పుట్టింటిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.పెళ్లిఅయ్యి సంవత్సరం మాత్రమే అయ్యింది.పెళ్లి నుండి బాగానే చూసుకున్నాడని.. తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడని అమ్మాయి తల్లిదండ్రులు అంటున్నారు.రెండురోజుల క్రితం అమ్మాయిని ఇంట్లో వదిలేసి పోయాడని..అప్పటినుండి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు అంటున్నారు.
నా కూతురు మృతికి కారణమైన అనంతపురం జిల్లా గుడిబండ ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాహుస్సేన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమెండ్ చేస్తున్నారు.అమ్మాయి తండ్రి కర్నూల్ జిల్లా బేతంచర్ల ఎస్ఐ గ పనిచేస్తున్నారు.