24 వేల సెటప్ బాక్స్ లను సీజ్ చేసిన కస్టమ్స్- ఏపీ ప్రభుత్వానికి షాక్

6 years ago janammata 0

24 వేల సెటప్ బాక్స్ లను సీజ్ చేసిన కస్టమ్స్- ఏపీ ప్రభుత్వానికి షాక్

చైనా వస్తువులు కొనద్దు అంటూ ఒకపక్క దేశభక్తులు ఊదరకొడుతుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ చైనా వస్తువులనే కొని అడ్డంగా బుక్కైపోయింది.ఇంటింటికీ ఇంట‌ర్నెట్, ఫోన్, టీవీ క‌నెక్షన్లు  రూ.149కే ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా ఇస్తామని చెప్పి సెటాప్ బాక్సులను కొనుగోలుచేసే కార్యక్రమానికి శ్రీకారంచుట్టింది.ఈ సెటప్ బాక్స్ ల కొనుగోలు కాంట్రాక్టును టెరా సాఫ్ట్ వేర్స్ కు అప్పచెప్పింది.ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ మొట్టమొదటగా 24 వేల సెటప్ బాక్స్ లకు చైనాకు ఆర్డర్ ఇచ్చింది.ఆర్దర్ ఇచ్చిన సెటప్ బాక్స్ లు చైనా నుండి చెన్నైకి ఓడలో వచ్చాయి.అక్కడ కస్టమ్స్ అధికారులు వాటిని పరిశీలించారు.ఇండియన్ స్టాండ‌ర్డ్  ప్రమాణాల‌కు అనుగుణంగా లేవని వాటిని సీజ్ చేశారు. ఎలాంటి సెటాప్ బాక్సుకైనా ఐటీ భ‌ద్రత‌కు సంబంధించి ఐఎస్ 13252 ప్రమాణాలు పాటించాల‌ని, ఈ బాక్సుల్లో ఆ ప్రమాణాలు పాటించ‌లేద‌ని అధికారులు చెపుతున్నారు.కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన సెటప్ బాక్స్ ల విలువ కోటిన్నర ఉంటుందని చెపుతున్నారు.