2022 నాటికీ బుల్లెట్ రైలు

6 years ago janammata 0

    

2022 నాటికీ బుల్లెట్ రైలు

2022 నాటికీ దేశంలో బుల్లెట్ రైలు దూసుకుపోనుంది. లక్ష 10 వేల కోట్ల ఈ ప్రాజెక్ట్ కు అహ్మదాబాద్ లో జపాన్ ప్రధాని శింజె అభేతో కలసి ప్రధాని ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.భారత చిరకాల స్వప్నం పట్టాలెక్కేందుకు తొలి  అడుగు పడిందని ప్రధాని అన్నారు. ఈ ప్రాజెక్ట్ వేగాన్ని,ఉద్యోగాలను,పర్యావరణ పరిరక్షణను,జపాన్ స్నేహాన్ని తీసుకు వచ్చిందని అన్నారు. పూర్వం నదుల వద్ద నాగరికత ఉండేది,తర్వాత రోడ్లు వున్నచోట ప్రజలు నివసించారు,ఇపుడు హైస్పీడ్ వద్దే అభివృద్ధి వుంటున్నదని అన్నారు.ఈ ప్రాజెక్టుకు 88 వేల కోట్ల రూపాయలు 0.1 శాతం వడ్డీకి జపాన్ ఋణం అందచేస్తున్నదని ప్రధాని చెప్పారు.మొదట ఈ బులెట్ రైలు అహ్మదాబాద్ ముంబై మధ్య 508 కిలోమీటర్ల వరకు నడుస్తుందని..ఈ ప్రాజెక్ట్ వల్ల 20 వేల మందికి ఉపాధి కలుగుతుందని,ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత మరో 4 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.బులెట్ రైల్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన తర్వాత  జపాన్ ప్రధాని మాట్లాడుతూ భరత్ మాక్ ఇన్ ఇండియా ను సాకారం చేస్తామని అన్నారు. జై జపాన్ జై ఇండియా  ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.