హిందూ మతోన్మాదం లోనే జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్య..

6 years ago janammata 0

 

 

 

హిందూ మతోన్మాదం లోనే జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్య..

బీజేపీ అధికారం లోకి వచ్చాక హిందూ మతతత్వ హత్యలు పెరిగాయి. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా రచనలు చేస్తున్నారని రచయితలను టార్గెట్ చేసి మరీ చంపుతున్నారు. ఇపుడు తమకు వ్యతిరేఖంగా పత్రిక నడుపుతున్నదని జర్నలిస్ట్ గౌరీ లంకేష్ను పాశవికంగా చంపారు. గతం లో కన్నడ రచయిత కల్బుర్గిని చంపారు. దబోల్కర్,పన్సారేలను కూడా హత్య చేశారు.రచయితలనే కద్దు ఇపుడు పత్రిక రచయితలను కూడా దారుణంగా చంపేస్తున్నారు.వీరు చేసిన నేరం ఏమిటి..?నేరం చేస్తే విచారించడానికి,శిక్షలు వేయడానికి కోర్టులు వున్నాయి. అంతేకాని భావప్రకటనా స్వేచ్ఛను తుపాకులతో అణిచివేస్తామంటే యెంత దుర్మార్గం. ప్రజలు,విద్యార్థి మేధావులు వీటిని సహిస్తారా..సహించరు. ఈ దుర్మార్గం పాలనకు వ్యతిరేఖంగా ఉద్యమిస్తారు. మాంసం తింటే తప్పు..తన భావాన్ని ప్రకటిస్తే తప్పు.. కాదు కూడంటే కాల్చేస్తారు.. భారత దేశం లో స్వేచ్ఛగా బతకలేమా అనిపిస్తుంది.. దాద్రిలో గోమాంసం తిన్నారని మొహమ్మెద్ అక్లాఖ్ ను కిరాతకంగా చంపేశారు. ఇక కల్బుర్గి అయితే కన్నడ యూనివర్సిటీ హంపిలో వైస్ ఛాన్సలర్ గ కూడా పనిచేసారు. ఈయన కన్నడలో  రచనలు చేశారు.ఈయన విగ్రహారాధనను,బ్రాహ్మణిజాన్ని వ్యతిరేఖించే బసవుడి ఫాలోయర్. ఈయన చేసిన వచన సాహిత్యానికి గాను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సాహిత్య అకాడమీ అవార్డులు ఇచ్చి సత్కరించింది.మరి ఇంట  ఇచ్చిన కల్బుర్గిని 78  వయసులో బీజేపీ అధికారం లోకి రాగానే హత్య చేసిందంటే ఈజిగా అర్థం అయిపోతుంది.ఈయన చేసిన నేరం ఒకటే.. విగ్రహారాధనను  వ్యతిరేఖించడం..విగ్రహారాధనను వ్యతిరేఖిస్తూ ఉపన్యాసాలు చేయడం. దీంతో హిందూ మతోన్మాదులు కన్నెర్ర చేశారు..పలుసార్లు హెచ్చరికలు చేశారు,బెదిరించారు.  ఈయన తన రచనలను ఆపలేదు. బీజేపీ అధికారం లోకి వచ్చేసింది..కల్బుర్గి గుండెల్లోకి తూటా వెళ్ళింది.. కల్బుర్గి హత్యను ఖండిస్తూ మేధావులు రోడ్డెక్కారు.. కల్బుర్గి హత్యకు నిరసనగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సాహిత్య అవార్డులను తిరస్కరించారు.మేధావులు రోడ్డెక్కడం,బసవుడి ఫాలోయర్ ను చంపడం..వ్యతిరేఖత తీవ్రం కావడం తో వీటినుండి దృష్టి మరల్చడానికి మోదీ లండన్ లో బసవుడి విగ్రహాన్ని ఆవిష్కరించాడు.కర్ణాటకలోనేమో విగ్రహారాధనను ,బ్రాహ్మణిజాన్ని వ్యతిరేఖించే బసవుడి ఫాలోయర్ కాల్బుర్గిని చంపేశారు.కన్నడిగులు ఎంతగానో ప్రేమించే బసవుడి విగ్రహాన్ని లండన్ లో మోడీ పెడతాడు. యెంత విడ్డూరమో కదా..ఇపుడు అదే బసవుడి ఫాలోయర్ అయినా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను కల్బుర్గి తరహాలోనే చంపేశారు. కల్బుర్గి ఇంట్లో ఉండగా కాల్పులు జరిపి చంపేశారు..గౌరీ లంకేశ్ కూడా ఇంట్లో ఉండగానే తుపాకీతో కాల్చి చంపేశారు. గౌరీ లంకేశ్ కూడా హిందూ మతోన్మాదానికి వ్యతిరేఖంగా తన రచనలను కొనసాగించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా,సండే మ్యాగజైన్,ఈనాడు తెలివిషన్ లలో ఈమె పని చేసింది.లంకేశ్ పత్రిక నడుపుతున్న తన తండ్రి చనిపోవడం తో ఆ భాద్యతలను నెత్తిన వేసుకొని పత్రికను కొనసాగించింది. తన ఆశయాలకు  ఎక్కడా భంగం కలగకుండా పత్రికను నడిపించింది. అయితే పబ్లిషర్ గా వున్న సోదరుడు ఇంద్రజిత్ కు ఇది సరిపోకపోవడం తో ఈమె గౌరీ లంకేశ్ గా పత్రికను పెట్టి తన ఆశయాలను,లక్ష్యాలను కొనసాగించింది.ఈమె రచనలను తట్టుకోలేని హిందూ మతోన్మాదులు గౌరిని టార్గెట్ చేశారు.. చంపేశారు. బీజేపీని వ్యతిరేఖించినా,హిందూ తీవ్రవాదాన్ని వ్యతిరేఖించినా ఇదే శాస్తి జరుగుతుందని మతోన్మాద పార్టీ లు ఇలా హత్యలు చేసి హెచ్చరిస్తున్నాయనడానికి ఈ హత్యలు ఉదాహరణలు. భిన్నత్వం లో ఏకత్వం అంటున్న దేశం లో ఏకతత్వమే ఉండాలి..అది  కావాలి.. లేదంటే చంపేస్తాం అనే విదంగా ఉన్నాయి. మరి పాలకుల నిరంకుశత్వాన్ని వ్యతిరేఖిద్దామా..! వద్దా..!                                                                                    సత్యన్న,జర్నలిస్ట్