సినిమా

చిరంజీవి తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన అభిమానులకు మెగా స్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలు తనకు చాల ప్రత్యేకమన్న ఆయన.. వృత్తి సినిమా,ప్రవృతి సేవలకు సంబంధించిన రెండు అద్భుత ఘట్టాలు ఆవిష్కరింపబడ్డాయని తెలిపారు. అభిమానులు గర్వపడేలా 151 వ చిత్రంగా చారిత్రక కథను ఎంచుకున్నానని, వారి ప్రోత్సాహం ఉంటే మరో 150 సినిమాలైనా అవలీలగా చేస్తానని చెప్పారు.