శ్రీశైలం రిజెర్వేయర్ కు ఒక్క క్యూసెక్కు నీరు రావడం లేదు.

6 years ago janammata 0

శ్రీశైలం రిజెర్వేయర్ కు ఒక్క క్యూసెక్కు నీరు రావడం లేదు.

ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. ఆల్మట్టికి 20,792 క్యూసెక్కుల నీరు రాగా నారాయణపూర్ డ్యామ్ కు 11 వేల క్యూసెక్కుల విడుదల చేశారు. నారాయణపూర్ కు వచ్చిన నీటిని కాల్వలకు వదులుతున్నారు. దిగువకు చుక్క నీటిని వదలడం లేదు.కింద వున్నా ప్రాజెక్టులకు పైనుండి ఒక్క క్యూసెక్కు నీరు కూడా రాకపోవడంతో,జూరాల,శ్రీశైలం రిజర్వాయర్లు నీళ్లు లేక వెల వెల బోతున్నాయి.శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 785 అడుగులవద్ద ఉంది.ఇన్ ఫ్లో లేదు.. అవుట్ ఫ్లో అసలు లేదు.జూరాల నుండి ఒక్క క్యూసెక్కు ఇన్ ఫ్లో లేదు.ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో లేకపోవడం తో తెలుగు రాష్ట్రాల ప్రజలు సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.