వాకపల్లి ఆదివాసీ మహిళల పై జరిగిన అత్యాచారం పై విచారణకు సుప్రీమ్ ఆదేశం

6 years ago janammata 0

వాకపల్లి ఆదివాసీ మహిళల పై జరిగిన అత్యాచారం పై విచారణకు సుప్రీమ్ ఆదేశం

2007 లో జి.మాడుగుల  మండలం వాకపల్లి లో 21 మంది ఆదివాసీ మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం చేశారని ఆరోపణలు వున్నాయి. జరిగిన సంఘటన పై ఫిర్యాదు చేయడానికి వెళితే ఎవరు కేసు తీసుకోలేదు.కేసు నమోదు చేయలేదు.దీంతో భాదిత మహిళలు స్థానిక ఎమ్మెల్యే సాయం తో పాడేరు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు.ఈ కేసు విచారన కు కూడా పోలీసులు అడ్డుపడ్డారు. అయినా పట్టువీడని భాదిత మహిళలు సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించారు. అత్యాచారం చేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది గ్రేహౌండ్స్ పోలీస్ ల పై విచారణను వేగవంతం చేయాలనీ సుప్రీం కోర్ట్  ఆదేశించింది.6 నెలల్లో భాదితులకు న్యాయం జరిగేలా చూడాలని స్థానిక ట్రయిల్ కోర్ట్ ను ఆదేశించింది.