లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మి పార్వతిపాత్రలో ఎమ్మెల్యే రోజా..?

5 years ago janammata 0

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మి పార్వతిపాత్రలో ఎమ్మెల్యే రోజా..?

నవరస నటసార్వభౌముడు ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కించేపనులు మొదలుపెట్టారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రాంగోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపికను తెరకెక్కించేపనులు మొదలు పెట్టారు. అయితే బాలకృష్ణ బయోపిక్ కంటే ఆర్జీవీ తీస్తున్న బయోపిక్ మీదనే అందరి దృష్టిపడింది. పెద్ద చర్చకు దారితీసింది.రాంగోపాల్ వర్మ బయోపిక్ లో ఏమిపెడతాడోనని అధికారంలో ఉన్న టీడీపీ నేతలు చంద్రబాబు తో సహా భయపడిపోతున్నారు.బయోపిక్ లో ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుండి దింపిన సంఘటలన్నిటిని పెడతారా.. వాటినిపెడితే..ఎలక్షన్ టైం లో ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని ఆందోళన చెందుతున్నారు.ఇక సినిమాకు డైరెక్టర్ ఆర్జీవీ అయితే,నిర్మాత వైస్సార్సీపీ నాయకుడని చెప్పడం కచ్చితంగా వైశ్రాయ్ హోటల్ సంఘటన ఉంటుందని అనుకుంటున్నారు. ఇక లక్ష్మి పార్వతి పాత్రలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా నటిస్తున్నాడని..రోజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సోషల్ మిడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అవకాశము కోసం రోజా కూడా ఎదురు చూస్తున్నట్లు చెపుతున్నారు.ఇద్దరు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రధాన భాగస్వామ్యంలో తెరకెక్కించే లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ లో కచ్చితంగా ఎన్టీఆర్ ను గద్దె దింపిన సంఘటనలు,వైస్రాయ్ హోటల్ సంఘటన ఉంటుందని  తెలిసిపోతుంది కదూ..