రెండు వేల కోట్ల అభివృద్ధి మాటే టీడీపీని గెలిపించిందా

5 years ago janammata 0

రెండు వేల కోట్ల అభివృద్ధి మాటే టీడీపీని గెలిపించిందా

నంద్యాల ఎమ్మెల్యే గా వున్న భూమా నాగిరెడ్డి గుండెపోటు తో మృతి చెందారు. ఆయన మృతి తో నంద్యాల నియోజక వర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకమునుపు నుండే నంద్యాల ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది.అభ్యర్థుల ఎంపిక నుండి ఉప ఎన్నిక పూర్తి అయ్యేదాకా అధికార ప్రతిపక్ష నాయకులూ పడిన పట్లు అన్నీ ఇన్నీ కావు. అభ్యర్థుల ఎంపిక తర్వాత  ఉప ఎన్నిక లో ఎలాగైనా గెలవాలని ఇరు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ వచ్చారు.కప్పదాట్లను ప్రోత్సహించారు. పార్టీలలోకి  వారికి కండువాలు కప్పుతూ..పోటా పోటీగా ప్రచారం చేస్తూ వచ్చారు.ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికల ప్రచారం మూగేసేవరకు నంద్యాల నియోజకవర్గం లో పర్యటించి ప్రచారం చేశారు.ధర్మానికి,అధర్మానికి జరుగుతున్న యుద్ధమని,ఏది మరో కురుక్షేత్ర సంగ్రామమని,ప్రభుత్వ పనితీరుకు మీరిచ్చే తీర్పని,రాబోయే 2019 ఎన్నికలకు నందయాళ్ ఉప ఎన్నిక సెమి ఫైనల్ అని ఇలా చెపుతూ జగన్ ప్రచారం నిర్వహించారు.ప్రతిపక్ష నేత 15 రోజులు నంద్యాల లోనే వుండి  ప్రచారం నిర్వహించినా  నంద్యాల ప్రజలు టీడీపీకే  జై అన్నారు.ఎందుకన్నారు అంటే ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ముఖ్యమంత్రి నంద్యాల కు 2 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రకటించారు.నోటిఫికేషన్ వచ్చేలోపే పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు.దశాబ్దాల నుండి పెండింగ్ లో వున్నా రోడ్ వెడల్పు కార్యక్రమం కూడా చేపట్టారు. పేదలకు వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. ఇండ్లకు శంకుస్థాపన కూడా చేశారు.ఇపుడు టీడీపీకి కాకుండా వైసీపీకి ఓట్లు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందని,ఇండ్లు కట్టడం ఆగిపోతుందని పేదలు భావించారు.కాదు ఎమ్మెల్యే సీటు కోసం పార్టీ మారిన శిల్ప మోహన్ రెడ్డి,ఎన్నికలో గెలిచి నంద్యాలకు ఏమి చేస్తారని ప్రజలు భావించారు.అందునా శిల్ప బ్రదర్స్ బహిరంగ సభలో చేసిన అహంకార పూరితమైన ప్రసంగం నంద్యాల ప్రజలకు రచించినట్లు లేదు.తల్లి తండ్రి కోల్పోయిన వారిపట్ల నిర్దయగా మాట్లాడటం ప్రజలు సహించలేక పోయారు. నగరి ఎమ్మెల్యే రోజా,మంత్రి అఖిల ప్రియ డ్రెస్ పై చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ వారే పెదవి విరిచారు. ఏది ఏమైనా చంద్రబాబు అభివృద్ధి మంత్రం నంద్యాల ఉప ఎన్నిక ఫలితం చూస్తే ఫలించినట్లే కనిపిస్తోంది.రాబోయే 2019 ఎన్నికలకు కూడా నంద్యాల వ్యూహాన్నే బాబు ఫాలో అయ్యే అవకాశాలు వున్నాయి.