యుద్దానికి సిద్దమైన నంద్యాల

5 years ago janammata 0

                   యుద్దానికి సిద్దమైన నంద్యాల

నంద్యాల ఉప ఎన్నిక పోరు కు అంతా సిద్ధమైంది.ఉప పోరు కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.వేళా మంది స్థానిక పోలీసులు మోహరించారు.కేంద్ర బలగాలు వచ్చేశాయి.అధికారులు ఈవీయం ల తో నంద్యాల కు చేరుకున్నారు.ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది.సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది.అధికార,ప్రతిపక్ష నాయకులు చేసిన హోరా హోరి ప్రచారాలు.. మాటల యుద్ధాలకు రేపు ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు.గెలుపు నీదా  నాదా  అన్నది రేపు పోలింగ్ తర్వాత పోటీపడ్డ నాయకుల అంచనాకు వచ్చే అవకాశముంది.నాయకుల సవాళ్లు,ప్రతి సవాళ్లకు ప్రజలు రేపు ఓటు ద్వారా తీర్పు ఇవ్వనున్నారు.బోండా ఉమా గుండు కొట్టించుకుంటారా,ప్రతిపక్షనాయకులకు ప్రజలు గుండు కొడతారా అన్నది రేపటి ఓటర్ దేవుడి పైనే ఆధార పడివుంది