మళ్లీ వంటగ్యాస్ ధర పెరిగింది
6 years ago janammata 0
మళ్లీ వంటగ్యాస్ ధర పెరిగింది
వంట గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. సుమారు రూ.4.50 పెరగటంతో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.495.69 కాగా, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.742 అయింది. సరాసరి పెట్రోలియం ధర, ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేట్‌ను బట్టి నెలవారీగా పెట్రోలియం మంత్రిత్వశాఖ గ్యాస్ ధరలను నిర్ణయిస్తోంది. ఈ మేరకు గత మే 30వ తేదీ నుంచి నెలకు రూ.4 చొప్పున 19 సార్లు పెరిగి సిలిండర్‌పై రూ.76.51 వరకు చేరుకుంది.దేశంలో సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులు 18.11 కోట్ల మంది, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఏడాదిలో ఇచ్చిన మూడు కోట్ల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లతోపాటు సబ్సిడీయేతర వంటగ్యాస్ వినియోగదారులు 2.66 కోట్ల మంది ఉన్నారు.అయితే 2018 నుండి గ్యాస్ పై సబ్సిడిని ఎత్తివేయడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.