మరో బాబా కేసులో కోర్ట్ తీర్పు
6 years ago janammata 0
మరో బాబా కేసులో కోర్ట్ తీర్పు
ఇద్దరు మహిళల అత్యాచారం కేసులో గురుమీత్ రామ్ రహీం బాబాకు 20 ఏళ్ళ జైలు శిక్ష,30 లక్షల జరిమానా విదించింది.ఈ కేసు తీర్పు ఇచ్చి 24 గంటలైనా కాకా ముందే మరో బాబా పై నమోదైన అల్లర్ల కేసులో కోర్ట్ తీర్పు ఇచ్చింది. హర్యానా లోని హిస్సార్ కోర్ట్ బాబా పై కేసును కొట్టివేసింది. 2006 లో సాధు రాంపాల్ ఆర్యసమాజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఆశ్రమం పై ఆర్య సమాజ్ నేతలు దాడి చేయగా అప్పుడు జరిగిన అల్లర్లలో ఒకరు చనిపోవడం తో హత్య,హత్య యత్నం,దేశద్రోహం కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను హిస్సార్ కోర్ట్ కొట్టేసింది.