బతుకమ్మ చీరలు తగులబెట్టిన మహిళలు
6 years ago janammata 0
బతుకమ్మ చీరలు తగులబెట్టిన మహిళలు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళలను మంచి చేసుకుందామని బతుకమ్మ పండగను ఆసరాచేసుకొని చీరల పంపిణీకి శ్రీకారం చుట్టాడు.తెలంగాణాలో ప్రతి మహిళా ప్రభుత్వం ఇచ్చిన చీర కట్టుకొని బతుకమ్మ ఆడాలని చెప్పాడు.
ఈ చీరలకోసం 221 కోట్లు కూడా కేటాయించాడు.బియ్యం బ్యాళ్లు ఇచ్చే స్టోర్ల నుండి చీరల పంపిణి చేసిండు. అయితే సీన్ రివర్స్ అయింది. మహిళలు చీరలు అయితే తీసుకున్నారు కాని వాటిని కట్టుకొని బతుకమ్మ ఆడలే..వాటిని తగులబెట్టి వాటిచుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడారు.నాసిరకం చీరలు ఇచ్చి మహిళలకు చీరలు అని బీరాలు పోతావా అంటూ కెసిఆర్ పై పాటలు పాడారు.మహిళల ఓట్ల కోసం కెసిఆర్ వేసిన చీరల పాచిక పారలేదు కదా సీన్ రివర్స్ అయ్యింది.