పార్లమెంట్ లో వ్యవసాయ భీమా పథకం పై గళం విప్పిన MP బుట్టా రేణుక

6 years ago janammata 0

పార్లమెంట్ లో వ్యవసాయ భీమా పథకం పై గళం విప్పిన MP బుట్టా రేణుక 

రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ భీమా పథకం అమలుకావడం లేదని పార్లమెంట్ లో కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక గళం విప్పారు.స్వాతంత్రము వచ్చినప్పటి నుండి  ఇప్పటివరకు వ్యవసాయ భీమా అమలు కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం (PMFBY ) కూడా సరిగా అమలు కావడం లేదని, దీనివల్ల దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.  PMFBY  ఈ పథకం టెక్నాలజీ వాడకం ద్వారా అభ్యర్థనలు త్వరితగతిన పరిష్కరింపబడునని వుంది,కానీ  జరగడం లేదు. నెలకాలం లోపు అభ్యర్థనలు పరిష్కరించి రైతులకు డబ్బులు చేరినప్పుడే అది నిజమైన సహాయము అవుతుందని అన్నారు.భీమా సొమ్మును వసూలు చేయడంలో చూపుచున్న చొరవ భీమా సొమ్మును చెలించడంలో చూపడం లేదని అన్నారు. ప్రభుత్వము ఈ విషయం లో దృష్టి  సారించి పథకాన్ని పకడ్భందిగా  అమలు చేయాలనీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.