నంద్యాల లో వైసీపీ వర్సెస్ టీడీపీ ఘర్షణ.. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నాయకుని గన్ మ్యాన్..
6 years ago janammata 0
నంద్యాల లో వైసీపీ వర్సెస్ టీడీపీ ఘర్షణ.. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నాయకుని గన్ మ్యాన్..
నంద్యాల లో పోలింగ్ ముగిసి 24 గంటలైనా కాక ముందే గొడవలు మొదలయ్యాయి..నంద్యాల మాజీ కౌన్సిలర్ చింపింగ్ అంత్యక్రియల కార్యక్రమానికి వైసీపీ నాయకుడు శిల్పాచక్రపాణి రెడ్డితన తన అనుచరులతో అనుచరులతో వెళ్ళాడు.. టీడీపీ నాయకుడు అభిరుచి మధు కూడా వెళ్ళాడు. అక్కడ ఇరువురి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.ఘర్షణ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. అభిరుచి మధు పై శిల్పాచక్రపాణి రెడ్డి అనుచరులు దాడి చేశారు.ఘర్షణ తీవ్రం కాకుండా అభిరుచి మధు గన్ మ్యాన్ రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు.. దీంతో అంత చెల్లా చెదురై పోయారు.ఈ సంఘటన నంద్యాల లో కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల పై కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ లు.. అయితే అభిరుచి మధు పై రౌడీషీట్ ఉందని చెపుతున్నారు. రౌడీషీట్ కు గన్‌మెన్‌లను కేటాయించడంపై విమర్శలువున్నాయి.