నంద్యాల లో ఆత్మగౌరవ పోరాటాలను పట్టించుకోలేదు

5 years ago janammata 0

నంద్యాల లో ఆత్మగౌరవ పోరాటాలను పట్టించుకోలేదు

నంద్యాల ఉప ఎన్నికలో రెండు సంస్థలు ఆత్మగౌరవ పోరాటం పేరుతో బరిలోకి దిగాయి.ఒకటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అయితే,మరొకటి రాయలసీమ పరిరక్షణ సమితి.రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ రాష్ట్ర నినాదం,రాయలసీమ ప్రజల ఆత్మగౌరవం పేరుతో తన అభ్యర్థిని బరిలోకి దింపారు.ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుండి ఎన్నిక ముగిసేదాకా నంద్యాల లోనే వుండి రాయలసీమ ఆత్మగౌరవ పోరాటం చేసాడు.వూరు వూరు తిరిగాడు.ఓటు ద్వారా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని,ఉప ఎన్నికలో గెలుపు రాయలసీమ రాష్ట్ర ఉద్యమానికి నాంది  పలకాలని ప్రజలను కోరాడు.కానీ ప్రజలు బైరెడ్డి మాటలను వినిపించుకున్నట్లు కనపడలేదు. రాయలసీమ పరిరక్షణ సమితి అభ్యర్థికి కేవలం 154  మంది మాత్రమే ఓట్లు వేశారు.ఇక ఎమ్మార్పీఎస్ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తోంది.ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని..ఓట్ ద్వారా ప్రభుత్వానికి  చెప్పాలని,ఇది మాదిగల ఆత్మగౌరవ పోరాటమని వారు పిలుపిచ్చారు.అయితే వీరి పిలుపును కూడా వారు పట్టించుకున్నట్లు కనపడలేదు. ఎమ్మార్పీఎస్ అభ్యర్థికి కేవలం 802 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో..ఆత్మగౌరవ  పోరాటాలు నంద్యాల ప్రజలు పెద్దగా పట్టించుకోలేదన్న మాట.