నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లో కౌంటింగ్..నంద్యాల లో టెన్షన్
6 years ago janammata 0
నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లో కౌంటింగ్..నంద్యాల లో టెన్షన్
నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు.ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది.మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 250 దాకా పోల్ అయ్యాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింమ్పు 15 నిమిషాలలో పూపూర్తి చేస్తారు.అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపును మొదలు పెడతారు.మొత్తం 19 రౌండ్లుగా విభజించారు. ప్రతి 10 నిమిషాలకు ఒక రౌండ్ ను పూర్తిచేసి ఫలితాన్ని ప్రకటిస్తారు.ఉదయం 9.30 గంటల కల్లా గెలుపోటములు తెలిసిపోయే అవకాశముంది. ఉదయం 10.30 గంటల కల్లా పూర్తి ఫలితము వచ్చే అవకాశముంది. ప్రతి రౌండ్ ఫలితం వెల్లడించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రం ఎదుట ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.నంద్యాల ఉప ఎన్నిక లో ఎవరు గెలుస్తారు అన్నదానిపై ఇప్పటికే అందరు అనేక సర్వేలు నిర్వహించుకొని పెట్టుకొని వున్నారు. టీడీపీ గెలుస్తుందని కొందరు,వైసీపీ గెలుస్తుందని కొందరు బెట్టింగులు కూడా పెట్టుకున్నారు.కోట్లాది రూపాయలు ఏపీ, తెలంగాణ, కర్ణాటకతో పాటు తెలుగు వారు ఉన్న విదేశాల్లో చేతులు మారనున్నాయి.దీంతో కౌంటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోటీచేసిన అభ్యర్థుల్లో కూడా టెన్షన్ నెలకొని వుంది. అంతే కాదు పోలింగ్ జరిగి 24 ఘంటలైనా కాకమునుపే నన్దుయిల్ లో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ బందోబస్తుకు ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 38 మంది ఎస్సైలు, 74 మంది ఎఎస్సై, హెడ్ కానిస్టేబుళ్ళు, 260 మంది కానిస్టేబుళ్ళు, 20 మంది మహిళా కానిస్టేబుళ్ళు, 44 సెక్షన్ల ఎఆర్ సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ దళం, 5 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలను అక్కడ మోహరింప చేశారు.ఏది ఏమైనా ఫలితంపై హై టెన్షన్ నెలకొని వుంది.