నంద్యాల పోలింగ్ ప్రశాంతం- 80 శాతం ఓటింగ్
6 years ago janammata 0
నంద్యాల పోలింగ్ ప్రశాంతం- 80 శాతం ఓటింగ్
నంద్యాల ఉప పోరు ప్రశాన్తంగా ముగిసింది.దాదాపు 80 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండే ఓటర్లు పోలింగ్ బూత్ లకు భారీఎత్తున తరలివచ్చారు.పోలింగ్ బూత్ ల దగ్గర భారి క్యూ లు కనిపించాయి.ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు.పోలింగ్ శాతం పెరగడం తో నాయకులూ ఎవరికి వారు తమ గెలుపు ఓటములపై అంచనాలకు దిగారు. గత సాధారణ ఎన్నికలలో కేవలం 62 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.ఎన్నికలు జరిగి మూడేళ్లు మాత్రమే అయ్యింది.భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరిగింది.ఈ ఎన్నికకు జరిగిన పోలింగ్ కు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.భారీ ఎత్తున పోలింగ్ నమోదు పై అటు తెలుగుదేశం పార్టీ,ఇటు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికీ వారు తమకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నారు.అయితే పోలీస్ ఇంటలిజెన్స్ మాత్రం టీడీపీ కే కాస్త అవకాశాలు వుంటాయని భావిస్తోంది.