నందుల కోట పై కుర్చీ భూమా బ్రహ్మానంద రెడ్డి దే.. నంద్యాల లో టీడీపీ ఘన విజయం
6 years ago janammata 0
నందుల కోట పై కుర్చీ భూమా బ్రహ్మానంద రెడ్డి దే..
నంద్యాల లో టీడీపీ ఘన విజయం
నందుల కోట నంద్యాల ఉప ఎన్నికలలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు.భారీ మెజారిటీ తో తన సమీప ప్రత్యర్థి శిల్ప మోహన్ రెడ్డి పై గెలుపొందారు.ప్రతి రౌండ్ లోనూ బ్రహ్మానంద రెడ్డి తన ఆధిక్యాన్ని కొనసాగించారు.నంద్యాల్ రూరల్ లోనూ,అర్బన్ లోనూ సైకిల్ హవానే కొనసాగింది.మొత్తం 19 రౌండ్లు గా విభజించి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. 16 రౌండ్లు పూర్తి అయ్యేటప్పటికి బ్రహ్మానంద రెడ్డి గెలుపు ఖాయమై పోయింది. గెలుపుకు కావలసిన ఓట్లు ఆయనకు వచ్చేసాయి. 17వ రౌండ్ కు టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి కి 91439,వైసీపీ అభ్యర్థి శిల్ప మోహన్ రెడ్డి కి 65446 ఓట్లు వచ్చాయి.17వ రౌండ్ కే బ్రహ్మానంద రెడ్డి కి దాదాపు 26 వేల మెజారిటీ వచ్చింది.మరో మూడు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి భూమా బ్రహ్మానంద రెడ్డి కి 27466 మెజారిటీ వచ్చింది.నంద్యాల లో టీడీపీ గెలుపు పై తెలుగు తమ్ముళ్లు సంబరాల్లో మునిగిపోయారు.అభివృద్ధికి పట్టం కట్టారని టీడీపీ నేతలు అన్నారు.2019 కి ఇదే ఫలితాలు పునరావృతమవుతాయని వారు అన్నారు.నంద్యాల ఎన్నికలు టీడీపీ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అని వైసీపీ నేతే అన్నారని..ప్రజలు ఓట్లు వేసి ప్రభుత్వానికి,చంద్రబాబు పాలనకు మద్దతు పలికారని టీడీపీ నేతలు అన్నారు.అయితే 8వ రౌండ్ పూర్తి అయ్యేటప్పటికే కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్ళిపోయిన శిల్ప మోహన్ రెడ్డి,నంద్యాల లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని అన్నారు.