తొలి పర్యటన కాశ్మిర్..రెండవ ప్రయాణము ఏపీ-రాష్ట్రపతి

5 years ago janammata 0

తొలి పర్యటన కాశ్మిర్..రెండవ ప్రయాణము ఏపీ-రాష్ట్రపతి 

రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు రేణిగుంట విమానాశ్రయం లో అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం తిరుచానూరు అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయం లో ధ్వజస్థంభం చుట్టూ ప్రదక్షణలు చేసిన ఆయన,అమ్మవారికి  ప్రత్యేక పూజలు చేసారు.రాష్ట్రపతి వెంట సీఎం చంద్రబాబు,గవర్నర్ నరసింహన్ వున్నారు. తదనంతరం రాష్ట్రపతికి తిరుపతి లో పౌర సన్మానము చేసారు.తన తోలి పర్యటన కాశ్మిర్ లో జరిగిందని,రెండవ పర్యటన తిరుపతి కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఎపి ఎంతోమంది గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిందని,కేంద్రం నుండి రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని,రాష్ట్రము చానా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.