జాతీయ పార్టీకి నంద్యాల ప్రజలు ఎన్ని ఓట్లు వేశారో తెలుసా..

5 years ago janammata 0

జాతీయ పార్టీకి నంద్యాల ప్రజలు ఎన్ని ఓట్లు వేశారో తెలుసా..

నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గడ్డం అబ్దుల్ ఖదీర్ అనే మైనారిటీ నాయకున్ని తన అభ్యర్థిగా నిలబెట్టింది.ఈయన గెలుపుకోసం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి,తులసి రెడ్డి,మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఇలా ఎంతోమంది బడా బడా బడా బడా నాయకులూ నంద్యాల లో ప్రచారం నిర్వహించారు.ఢిల్లీ నుండి కూడా పెద్దలు వాచిపోయారు. ఎందరు వాచిపోయినా..ఎన్ని మాటలు చెప్పినా నంద్యాల ప్రజలు వినలేదు. రాష్ట్ర విభజనను ప్రజలు మరిచిపోలేదు అనడానికి ఉప ఎన్నికలో ఆ పార్టీకి వేసిన ఓట్లే నిదర్శనం.ఇంతకీ జాతీయ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయనే కదా..1382 పడ్డాయప్ప.. అవి కూడా పొరపాటున..తప్పి పడిపోయిన ఓట్లు.. ఈ ఓట్లను బట్టి చూస్తేనే ఏపీ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలుస్తుంది.