ఆడలేక మద్దెలోడని..

6 years ago janammata 0

ఆడలేక మద్దెలోడని..

నంద్యాల,కాకినాడ లలో ఓడిపోయినా తర్వాత ఇప్పుడు వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. అటు చావలేక..ఇటు బతకలేక అన్నట్లు అయ్యింది.గట్టిగా ఎవరూ మాట్లాడలేకపోతున్నారు.ఎన్నికలలో  ఓడిపోవడానికి కారణాలను స్పష్టంగా విశ్లేషించుకోలేక పోతున్నారు. ఓడిపోయినా తర్వాత అందరు అనే మాటలనే అంటున్నారు.అధికారం,డబ్బు బాగా వినియోగించారని.ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని అనేసి చేతులు దులుపుకుంటున్నారు. ఎన్నికల కంటే ముందు ప్రభుత్వ పాలనకు  రెఫరెండం అని,ఈ రెండుచోట్ల  ప్రజలు ఇచ్చే తీర్పు చంద్రబాబు పనితీరుకు నిదర్శనమని ఇలా అన్ని మాట్లాడేశారు.రెండుచోట్ల ఓడిపోయిన తర్వాత ఆ మాటలకు మూతపడ్డాయి.ఇప్పుడు ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. నంద్యాల ఉప ఎన్నికల కోసం ప్రతిపక్షనేత ఏకంగా 15 రోజులు నంద్యాల లోనే మకాం వేశారు.రోజు  ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసారు.అధికారపక్షాన్ని అంత అన్నారు..ఇంత అన్నారు.. పోలింగ్ జరిగింది. ప్రతిపక్షానికి ప్రజలు వ్యతిరేఖంగా ఓట్ వేశారు.చంద్రబాబు పాలనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.ఎందుకు ఇలా రెండుచోట్ల ఘోరంగా ఓడిపోయామో ప్రతిపక్షనేత విశ్లేషించుకున్నారా.. అధికారపక్షానికి ప్రజలు అనుకూల తీర్పు ఇచ్చినపుడు.. ప్రతిపక్షం సరిగా లేదనేగా ఆనందరికి అర్థమయ్యేది.ప్రతిపక్షం ఒక నిర్మాణాత్మకంగా పనిచేయనపుడు ప్రజలు ఇలాగె తీర్పు ఇస్తారు.ఇప్పటికైనా ప్రతిపక్షం భాద్యతాయుతంగా పనిచేయాలి.. తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో విశ్లేషించుకుని పనిచేయాలి. వైసీపీ అంటే రెడ్డి సామాజికవర్గం అనే దాన్ని పోగొట్టాలి.ప్రజలసమస్యలపై సీరియస్ గ పనిచేయాలి.అప్పుడే ప్రజలు వెంటవుంటారు తప్ప..మరేమో అనుకుని పోతే ఇదిగో ఇలాంటి ఫలితాలే వస్తాయి.