గిరిజన విద్యార్థిని ఎలా చనిపోయింది..

5 years ago janammata 0

    గిరిజన విద్యార్థిని ఎలా చనిపోయింది..

ఇపుడు కర్నూల్ లో  వివాదం నడుస్తోంది.కట్టమంచి స్కూల్ లో 10 తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని   ప్రీతి బాయ్ చనిపోయింది. అది ఎలాగంటే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పాఠశాల యాజమాన్యం అంటోంది. కాదని విద్యార్ధి  సంఘాలు  అంటున్నాయి. విద్యార్థిని ఉరి వేసుకొని చనిపోయి వుంటే కాలు విరుగుతుందా.. వీపుపై దెబ్బలు వస్తాయా..కాలు  నేల మీదకు ఎలా ఆనింది..పేరెంట్స్ కు తెలపకుండా..శవ పంచనామా చేయకుండా  విద్యార్థిని మెడకు వున్నా ఉరిని తీసేసి పోస్టుమార్టం కు ఎలా తీసుకు  వస్తారు.విద్యార్థిని మృతిని,ఆమె చనిపోవడానికి గల కారణాలను మూడోమనిషికి తెలియకుండా కప్పేయాలనుకున్నారా..ఎందుకు అంత రహస్యంగా తీసుకెళ్లారు.. ఈప్రశ్నలన్నీ  ఎవరికైనా వస్తాయి.ఈ సందర్భంలోనే  ఘర్షణ జరిగింది.అక్కడకు వచ్చిన ప్రైవేట్ స్కూల్ అసోషియేషన్ నాయకుడు శ్రీనివాసరెడ్డి పై విద్యార్ధి సంఘాలు చేయి చేసుకున్నాయి.విద్యార్ధి సంఘాలు చేయి చేసుకున్నాయి కాబట్టి విద్యాసంస్థలను మూసేయాలని  ప్రైవేట్ స్కూల్ అసోషియేషన్ ఇవ్వడం ఎంత దారుణం.విద్యార్థిని చనిపోతే దయ,జాలి లేదు లేదు కానీ చావుకు కారణమని భావిస్తున్న వారిని దేహశుద్ది చేస్తే మాత్రం విపరీతమైన సింపతీ వచ్చేస్తుంది.ప్రాణం కంటే ..ప్రాణం పోవడానికి కారణమని భావిస్తున్న వాడే గొప్పవాడన్నమాట.ఇపుడు గిరిజన విద్యార్థిని ఎలా చనిపోయింది.. ఆమె మృతి కి కారణాలు ఏమిటి అన్న విషయాలను విడిచిపెట్టి,ఈ  కొసరు విషయాన్నే ఇష్యూ చేస్తున్నారు.దాడి చెసింటే,దాడి చేసినవారి మీద కేసులు పెట్టవచ్చు..  అంతేకాని అసలు విషయాన్ని  పక్కకు నెట్టేయవలసిన అవసరం లేదు.శ్రీనివాసరెడ్డిని కొట్టారని  మరుసటి రోజు స్కూల్స్ యాజమాన్యం బందుకు పిలుపు ఇచ్చింది.మళ్లి 24 న స్కూల్స్ కు బందు పెట్టారు . స్కూల్ విద్యార్థిని చనిపోతే సంతాపసూచికంగా ఒక్కరోజు స్కూల్స్ ఎందుకు బందు పెట్టలేదు. ఎట్టకేలకు గిరిజన విద్యార్థిని మృతి విషయాన్నీ పక్కదారి పట్టించడానికి ఈ  విధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం  చేస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.గిరిజన విద్యార్థిని ఆత్మహత్య  చేసుకుందా.. హత్య చేసారా.. ముందు ఆ విషయం తేల్చాలి.. ఏమీ తేల్చకుండా కులాల కొట్లాటగా మార్చేస్తున్నారు. సమాజం అంత గమనిస్తూనే వుంది.. ఎవరు ఎక్కడి నుండైనా తప్పించుకోగలరు.. కానీ  సోషియల్ మీడియా నుండి మాత్రమ్ తప్పించు కోలేరు..