గిరిజన విద్యార్థినిది ఆత్మహత్య కాదు..హత్య..విద్యార్ధి,ప్రజా సంఘాలు

5 years ago janammata 0

గిరిజన విద్యార్థినిది ఆత్మహత్య కాదు..హత్య..విద్యార్ధి,ప్రజా సంఘాలు 

కట్టమంచి స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న ప్రీతీ భాయి ఆత్మహత్య చేసుకోలేదని,ఆమెను నా నా చిత్రహింసలు పెట్టి స్కూల్ యాజమాన్యం చంపేసిందని  ఆరోపిస్తూ విద్యార్ధి,ప్రజా సంఘాలు కర్నూల్ కలక్టరేట్ ముందు ఆందోళనకు దిగాయి.గిరిజన విద్యార్థినిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలనీ,స్కూల్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలని వారు డిమాండ్ చేసారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వారు ఆందోళనను కొనసాగించారు.వర్షం వచ్చినా  వర్షం లో తడుస్తూ తమ పోరాటాన్ని కొనసాగించారు.విద్యార్ధి సంఘాలు,ప్రజా సంఘాలు చేపట్టిన ఈ ఆందోళనకు రాయలసీమ మహిళా సంఘ్ తోపాటు పెద్దఎత్తున మహిళలు మద్దతు పలికారు.పోలీసులు కాలయాపన చేస్తూ గిరిజన విద్యార్థిని మృతికి కారకులైన వారిని తప్పించే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు.విద్యార్థిని మృతికి కారకులైన కట్టమంచి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకుంటే దశలవారి ఉద్యమాలు చేస్తామని ప్రీతీ భాయి న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ బాలసుందరం హెచ్చరించారు.