కాకినాడ లో ముగిసిన పోలింగ్

6 years ago janammata 0

కాకినాడ లో ముగిసిన పోలింగ్

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో మొత్తం 48 వార్డులకు గాను 241 మంది అభ్యర్థులు పోటీ చేశారు.196 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.48 వార్డులలో టీడీపీ 39 వార్డులలోను,బీజేపీ 9 వార్డులలోను పోటీ చేసింది.వైసీపీ మొత్తం వార్డులలో తన అభ్యర్థులను పోటీలో నిలిపింది.సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరిగింది.పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ 62 శాతం దాక పోల్ అయినట్లు తెలుస్తోంది. కాకినాడ శివారు ప్రాంత ప్రజలు ఎక్కువగా పోలింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 1 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.