కర్నూల్ లో ప్రారంభమైన వినాయకుని శోభాయాత్ర..

6 years ago janammata 0

కర్నూల్ లో ప్రారంభమైన వినాయకుని శోభాయాత్ర..

కర్నూల్ లో వినాయకుల శోభాయాత్ర ప్రారంభమైంది. కర్నూల్ లోని రాంబొట్ల దేవాలయం లో వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ను ప్రారంభించారు.వినాయకుని పూజ కార్యక్రమంలో కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి,కర్నూల్ ఎంపీ బుట్టారేణుక,విహెచ్ పి నాయకులూ,ఆర్ స్ స్ నాయకులు పాల్గొన్నారు.రాంబొట్ల దేవాలయం లో పూజలు అందుకున్న వినాయకుడు సాయంత్రం మూడు ఘంటల సమయానికి నిమజ్జన ఘాట్ కు చేరుకున్నాడు. అక్కడ రెవిన్యూ మంత్రి కె ఈ కృష్ణమూర్తి పూజచేసి మొదటి విగ్రహాన్ని కేసి కెనాల్ లో నిమజ్జనం చేసి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు.దాదాపు 400 వినాయక విగ్రహాలను కెనాల్ లో నిమజ్జనం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.వర్షాలు రాకవడంతో కేసి కెనాల్ లో నిమజ్జనం రోజు వరకు అడుగులోతు వరకు కూడా నీళ్లు లేకపోవడం తో సుంకేసుల రిజర్వాయర్  నుండి వినాయక నిమజ్జనం కోసం నీటిని విడుదల చేయించారు.సుంకేసులలో నీళ్లు లేకపోయినా వున్న కొద్దిపాటి నీటినే కాలువకు వదిలారు.నిమజ్జనం ప్రాంతం లో నీళ్లు నిలవడానికి కెనాల్ లో అడ్డంగా ఇసుక బస్తాలను పెట్టారు. ఆ అరకొర నీటిలోనే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వినాయక నిమజ్జనానికి 2002 తర్వాత 2017 లో ఈ పరిస్థితి వచ్చింది.గణేష్ నిమజ్జనానికి నీళ్లు లేని పరిస్థితి కర్నూల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితిని స్పష్టంగా చెపుతోంది. కరువు పరిస్థితిని పాలకుల కళ్ళకు చూపిస్తోంది.