కర్నూల్ లో పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి – కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక

6 years ago janammata 0

 

కర్నూల్ లో పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి – కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక 

కర్నూల్ లో పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండని కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక  కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి  సంతోష్ కుమార్ గంగోవర్ కు విజ్ఞప్తి చేసారు.రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని ఆమె మంత్రికి వివరించారు.కర్నూలు జిల్లా లో  సుమారు 1,10,000 కు మించి ఖాతాదారులు వున్నారని,అలాగే 60,000 కు మించి ఉద్యోగ  విరమణ పొందిన వారు ఉన్నారని, వీరందరూ తమ ప్రావిడెంట్ సమస్యలు పరిస్కారం చేసుకొనుటకు 300 నుండి 350 కిలోమీటర్స్ ప్రయాణించవలసి వస్తున్నదని ఆమె మంత్రికి వివరించారు.రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రము లోని 10 జిల్లాలకు 7 ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలు ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాలకు కేవలము 4 ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రములో రెండు ఉప ప్రాంతీయ కార్యాలయములు ఉంటె ఆంధ్ర ప్రదేశ్ లో ఒకటే ఉన్నదని చెప్పారు. అందుకే కర్నూల్ లో రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనీ ఎంపీ బుట్ట రేణుక మంత్రిని కోరారు.