కర్నూలులో నిమజ్జనానికి నీళ్లు లేవు.
6 years ago janammata 0
కర్నూలులో నిమజ్జనానికి నీళ్లు లేవు.
కర్నూలులో వినాయక నిమజ్జనానికి నీళ్లు లేవు.2002 తర్వాత 2017లో పరిస్థితి పునరావృతమైంది.ప్రతి సంవత్సరం కేసి కెనాల్ లో నిమజ్జనం చేస్తున్నారు.ఈసారి కెనాల్ లో నీళ్లు లేవు.విడుదల చేయడానికి సుంకేసులలో నీళ్ళు లేవు.ఏదో నాయకులు వినాయక నిమజ్జనం ప్రారంభించాలి కాబట్టి నామమాత్రంగా కాలువకు నీళ్ళు వదిలారు.కార్యక్రమాన్ని ప్రారంభించారు,కానీ నమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు అలానే ఉండిపోయాయి.కాలేదు.అర్దరాత్రి దాటినా 10 శాతం విగ్రహాలు కూడా నిమజ్జనం కాలేదు.వందల విగ్రహాలు రోడ్డు మీదనే ఉండిపోయాయి.ఆ విగ్రహాల నిమజ్జనం ప్రశ్నార్థకంగా మారాయి.మరి వినాయక విగ్రహాలు నిమజ్జనం కాకపోవడానికి కారకులు ఎవరు?ఆ పాపం ఎవరిది.?ఆ పాపం ఎవరిది అంటే పాలకులది.కర్నూలులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న విషయం జిల్లా మంత్రికి తెలుసు.కేసి కెనాల్ లో నీళ్ళు లేవని తెలుసు.మరి ఎందుకు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటి విడుదలకు చర్యలు తీసుకోలేదు.ఇపుడు కెనాల్లో నీళ్లు లేక..సగం నిమజ్జనమై,మరో వందల వినాయకులు మేమెప్పుడు అన్నట్లు ఎక్కిరిస్తుంటే,హిందూ సాంప్రదాయం ఫక్కున నవ్వుతోంది.కర్నూలు పట్టణ ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నా పట్టించుకోని పాలకులు,జిల్లా మంత్రి..వినాయక నిమజ్జనానికి మాత్రం సుంకేసుల రిజర్వాయర్ నీటిని కాలువకు విడుదల చేశారు.ఆ నీళ్లు కూడా సరిపోక వందలాది వినాయకులు మరసటి రోజు వరకు అలాగే రోడ్డుపైనే ఉండిపోయాయి.వినాయకుల నిమజ్జనానికి పడుతున్న ఈ కష్టాలు ,కర్నూలు కరువును సూచిస్తున్నయి కదూ..!