కర్నూలులో కేన్సర్ ఆసుపత్రి పై పార్లమెంట్ లో ఎంపి బుట్టా రేణుక

6 years ago janammata 0

 

కర్నూలులో కేన్సర్ ఆసుపత్రి పై పార్లమెంట్ లో ఎంపి బుట్టా రేణుక

కర్నూలు లో ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన క్రింద మంజూరైన కాన్సర్ ఆసుపత్రి వేరే ప్రాంతమునకు తరలిస్తున్నారని వస్తున్న వార్తల పై కర్నూలు ఎంపి బుట్టా రేణుక పార్లమెంట్ లో మాట్లాడారు.కర్నూలులో  క్యాన్సర్ ఆసుపత్రి ఉంటే రాయలసీమ,సీమకు ఆనుకొని ఉన్న  తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రము లోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని,కర్నూలులో కాన్సర్ ఆసుపత్రి ఆవశ్యకతను ఆమె తెలియజేశారు.త్వరలోనే కర్నూలు లో కాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించే విషయమై సంబంధిత శాఖలను ఆదేశించవలసినదిగా ప్రధాన మంత్రి మరియు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిలను ఆమె కోరారు