ఇంటర్నెట్,మొబైల్ డేటా సేవలు నిలిపివేత

6 years ago janammata 0

ఇంటర్నెట్,మొబైల్ డేటా సేవలు నిలిపివేత

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ సింగ్ కేసు తీర్పు నేపథ్యం లో హర్యానా,పంజాబ్ లలో ఇప్పటికే 201 రైళ్లను రద్దు చేసారు.ఇంటర్నెట్,మొబైల్ సేవలను నిలిపివేశారు.ఇద్దరు మహిళల అత్యాచారమ్ కేసుకు సంబంధించి ఇప్పటికే గుర్మీత్ సింగ్ ను దోషిగా తేల్చింది. అయితే తీర్పును 28న పంచకుల సిబిఐ కోర్ట్ వెలువరిచనుంది. ఈ  నేపథ్యం లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.రైళ్లను రద్దు  చేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పంజాబ్ లో 75 కంపెనీల కేంద్ర బలగాలు,హర్యానా లో 35 కంపెనీల కేంద్ర బలగాలను ఉంచారు.ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం లో పోలీస్ లు ఎటువంటి ఆయుధాలు ఉపయోగించవద్దని  పోలీస్ ల ను కోర్ట్ ఆదేశించింది.అయితే ఇప్పటికే పంజాబ్,హర్యానా ల లో గుర్మీత్ సింగ్ అనుచరులు తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.పోలీస్ ల పైకి రాళ్ళూ రువ్వారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు.దీంతో పోలీస్ లు భాష్ప వాయు గోళాలు ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టారు.