ఆలోచనలకు మూలకారణమైన గౌరి లంకేశ్ ను బొందబెట్టారు..ఇపుడు ఆలోచించే మెదళ్ళను చంపాలనుకుంటున్నారు..కంచె ఐలయ్య

6 years ago janammata 0
ఆలోచనలకు మూలకారణమైన గౌరి లంకేశ్ ను బొందబెట్టారు..ఇపుడు ఆలోచించే మెదళ్ళను చంపాలనుకుంటున్నారు..కంచె ఐలయ్య
కంచె ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాలలో రగడ జరుగుతోంది.ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడో ఒకచోట ఆర్యవైశ్యులు ఆందోళనలు చేస్తున్నారు. పుస్తకాన్ని నిషేధించాలని,ఒక కులాన్ని టార్గెట్ చేసి వ్యాసాలు రాసిన రచయితను అరెస్ట్ చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. ఆర్య వైశ్యులు ఒకవైపు ఆందోళన చేస్తుంటే మరొకవైపు ఎస్సీ,ఎస్టీ, బీసీ సంఘాలు పుస్తక రచయిత కంచె ఐలయ్య కు అండగా నిలుస్తున్నాయి.గతంలో కంచె ఐలయ్య వివిద కులాల పై ‘సామాజిక వైద్యులు మంగలోళ్ళు’, ‘ బహుజన స్త్రీ వాదులు చాకలోళ్ళు’ , ‘ ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసీలు’ , ‘ అజ్ఞాత ఇంజనీర్లు కుమ్మరి,కమ్మరి,కంసాలి,వడ్రంగి,గౌండ్ల’, అద్యాత్మిక ఫాసిస్టులు బ్రాహ్మణులు’, లాంటి పుస్తకాలు రాశారు.ఈ పుస్తకాలు ప్రజలలోకి వచ్చినపుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇపుడు  ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు’  పుస్తకంతోనే ఈ పుస్తకాలన్నీ పాపులర్ అయిపోయాయి. రచయితగా  ఐలయ్య అంటే తెలియనివారికీ ఆయన  పుస్తకాలతో పరిచయం లేని అందరికీ తెలిసిపోయారు.అసలు పుస్తకం లో ఏముంది.. ఎందుకు ఆర్య వైశ్యులు ఇంతగా ఆందోళనలు చేస్తున్నారంటే.. కింది కులాలను మార్కెట్ పేరుతో,షాపుల పేరుతో వారి ఉత్పత్తిని తక్కువ ధరకు కొని,కొన్నవాటినే మళ్ళీ 10 రెట్లు ధరను పెంచి,ఉత్పత్తి చేసి సరుకును అమ్మిన రైతులు,ఆదివాసీలు,దళితులనే  వినియోగదారులుగా మార్చి అమ్ముతున్నారు.కోమటోళ్ళు ఉత్పత్తిదారులు కాదని.. ఉత్పత్తిదారుల శ్రమను దోచుకునే వారని ఐలయ్య పుస్తకం లో రాశారు.ఇలా చేస్తున్న దాన్నే సోషల్ స్మగ్లింగ్  గా ఐలయ్య పుస్తకం లో పేర్కొన్నాడు. మమ్మల్ని సామజిక స్మగ్లర్లు అంటావా అంటూ ఆర్యవైశ్యులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు.పుస్తకాన్ని నిషేధించాలని,కులాన్ని కించపరుస్తూ రాసిన రచయితను అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు.ఈ రగడ కొన్ని రోజులుగా కొనసాగుతూనే వుంది.ఆర్యవైశ్యులు ఐలయ్య పై కేసులు కూడా పెడుతున్నారు.చంపుతామని బెదిరిస్తున్నారు.ఆర్యవైశ్యులు ఐలయ్య కు వ్యతిరేఖంగా ఆందోళన చేస్తుంటే ఎస్సీ,ఎస్టీ, బీసీ సంఘాలు రచయితకు మద్దతు తెలుపుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి తీవ్రం కావడం తో రచయిత రంగం లోకి దిగారు. రచన పై అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని.. లేదంటే చర్చకు రావాలని అంటున్నాడు.నిన్నగాక మొన్న ఆలోచనలకు మూలకారణమైన గౌరి లంకేశ్ ను బొందబెట్టారు.ఇపుడు కంచె ఐలయ్య ను బొందపెట్టి మేధావుల ఆలోచనలను చంపేయాలనుకుంటున్నారని అంటున్నాడు.కోమటి సామాజికవర్గానికి చెందిన గాంధీ,బ్రాహ్మణ సామజిక వర్గానికి చెందిన నెహ్రూ,దళిత సామాజికవర్గానికి చెందిన అంబెడ్కర్ లు కలిసి రాజ్యాంగాన్ని రాసారని..మరి రాజ్యాంగం లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని..మరి కోమట్లు రాజ్యాంగాన్ని గౌరవించడం లేదా .. రాజ్యాంగాన్ని,జ్యూడిషరీ విధానాన్ని అగౌరపరుస్తున్నారా అని  ఐలయ్య అంటున్నాడు. మరి ఆందోళన చేస్తున్న ఆర్యవైశ్యులు తమ సామజికవర్గంలో ఉత్పత్తిదారులు వున్నారా.. లేక ఉత్పత్తిదారుల శ్రమ దోపిడి వర్గంలో వున్నారా అనేది ప్రజలకు చెప్పాల్సి వుంది.మరి వీరు ఏ వర్గం లో వున్నారో మెజారిటీ సోషల్ వర్గమే తేలుస్తుంది.వీరు మార్కెట్లలో దోపిడీ చేయడం లేదని క్లారిటీ ఇవ్వాలి. ఇవేవి చేయకుండా పుస్తక రచయితను చంపేస్తామని బెదిరించడం మెజారిటీ సామజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. అంతేకానీ భావాన్ని వ్యక్తీకరించిన వారిని అంతమొందిస్తామంటే..రాజ్యాంగాన్ని  అంతమొందిస్తానన్నట్లే..రాజ్యాంగ వ్యవస్థ అంటే లెక్కలేనట్లే.అంతా రాజ్యాంగ బద్దులై ఉన్నారు కాబట్టి ..పుస్తక రచనపై అభ్యంతరాలు ఉంటే చర్చించుకోవాలి లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి.