అరెస్టులు కోరుతూ ఆందోళనలు ఉదృతం.. జోరు వాన లోనూ కొనసాగించిన ధర్నా

6 years ago janammata 0

 

అరెస్టులు కోరుతూ ఆందోళనలు ఉదృతం.. జోరు వాన లోనూ కొనసాగించిన ధర్నా

గిరిజన విద్యార్థిని ప్రీతీ భాయి మృతికి కారకులైన కట్టమంచి స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలనీ కర్నూల్ కలెక్టరేట్ ముందు ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. విద్యార్థి,ప్రజాసంఘాలు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి ఆందోళనలను కొనసాగిస్తూన్నారు.ఒక గిరిజన విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో చనిపోతే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని సంఘాలు విమర్శిస్తున్నాయి.అట్టడుగు బలహీన వర్గాలు,దళితులు,గిరిజనులు ఇప్పుడిప్పుడే చదువుకోవడానికి వస్తున్నారని..వారు చదువుకోకుండా అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని.. చదువుకునే ప్రీతిభాయి లాంటి అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేసి చంపేస్తున్నారని వారు అంటున్నారు.పిప్రీతిభాయి  చేసుకొని ఉంటే తల్లిదండ్రులు,రెవిన్యూ వాళ్ళు వచ్చేవరకు  వుంచలేదని,పంచనామా చేయకుండా ఎలా పోస్టుమార్టంకు తీసుకు వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.ప్రీతిభాయి డి హత్య అని స్పష్టంగా తెలుస్తున్నదని అన్నారు. జోరుగా వర్షం కురుస్తున్న వారు ఆందోళనను కొనసాగించారు.